Post Office Recurring Deposit Scheme : పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అనేది పొదుపును మెరుగుపరుచుకునే వారికి ప్రత్యేకంగా రూపొందించిన మంచి పథకం. ప్రతిరోజు కుంత మొత్తంలో డబ్బుని ఆదా చేస్తూ పెద్ద మొత్తాన్ని పొందేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది చూడండి.
Post Office Recurring Deposit Scheme Features :
- ఈ పథకంలో మీరు రోజుకు కేవలం 100 రూపాయలు చొప్పున పొదుపు చేయవచ్చు అంటే నెలకు 3000 రూపాయలు మరియు సంవత్సరానికి 36000.
- ఈ పథకంలో మీరు ఐదేళ్లపాటు పొదుపు చేయవచ్చు , మొత్తం డిపాజిట్ 1,80,000 అవుతుంది దానికి మీకు 6.7% వడ్డీ రేటు తో ఐదేళ్లు కలిపి మొత్తం 2,14,097 వస్తుంది.
Post Office Recurring Deposit Scheme Rate of Interest :
- ప్రస్తుతం వడ్డీ రేటు మాత్రం 6.7 % ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి మార్చుతుంది.
- ఈ పథకంలో మనకు 12 నెలల తర్వాత మీరు మొత్తం డిపాజిట్ పై 50% రుణం పొందవచ్చు మరియు ఈ పథకం వడ్డీ రేటు తో 2% అదనంగా వడ్డీ చెల్లించడం ఉంటుంది.
Post Office Recurring Deposit Scheme Details :
ఈ పథకంలో మీరు రోజుకి 100 రూపాయలు కాకుండా పెద్ద మొత్తాన్ని పొదుపు చేస్తే మీకు 5 లేదా 10 సంవత్సరాల లోపు పెద్ద రాబడి వచ్చే అవకాశం ఉంది. అందుకే మీరు ప్రతి నెల 5 లేదా పదివేల రూపాయల వరకు పొదుపు చేస్తే మీకు 5 లేదా 10 సంవత్సరాలలో చాలా డబ్బులు వస్తాయి.
Post Office Recurring Deposit Scheme 5 years and 10 Years Returns :
- మీరు నెలకు 5 వేల రూపాయలు పెట్టుబడి పెడితే మీకు ఐదేళ్లకు 3,56,830 రాబడి గా మారుతుంది.
- అదే మీరు నెలకు 10 వేల రూపాయలు పెట్టుబడి పెడితే మీకు 17,08,546 రూపాయలు వస్తుంది.
Post Office RD Scheme Details :
మీరు ఈ పథకానికి కనీసం వంద రూపాయలతో కూడా ప్రారంభించవచ్చు. మీరు ఐదేళ్లు పూర్తయ్యాక కూడా మరో 5 ఏళ్ళు కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. కనుక ఈ పథకం మీకు నచ్చినట్లయితే త్వరగా వెళ్లి బ్యాంకులో ఈ పథకానికి అప్లై చేసుకోండి.
Conclusion :
ఈ పథకంలో పెట్టుబడి చేసే ముందు మీరు ఈ పథకం గురించి తెలిసిన వారి దగ్గర సలహా తీసుకోవడం మంచిది. చిన్న పొదుపులో ద్వారా పెద్ద రాబడిగా మారేందుకు ఇది ఒక ఉత్తమ మార్గం.. మీ ఆదాయం బట్టి పొదుపుని ప్రారంభించుకోండి.
Click Here For Official Website : Post Office
Read Also :
- TCS Recruitment 2024 | 5 LPA జీతం | Jobs in Telugu
- PM Vidya Lakshmi Scheme : విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం బంపర్ ఆఫర్ | 10 లక్షల వరకు ఆర్థిక సాయం | Eligibility
- Ditto Jobs 2024 | 6 LPA జీతం | Ditto Jobs for Freshers | Jobs in Telugu
- TS Outsourcing Jobs | తెలంగాణ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో భారీ ఉద్యోగాలు | Jobs in Telugu | Govt Jobs 2024
my name is Rithik , I am working as a content writer in mypatashala.com