PM Vidya Lakshmi Scheme : కేంద్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసేందుకు రూపొందించిన పథకం – PM Vidya Lakshmi Scheme. ఈ పథకం ద్వారా భారతదేశంలో ఉన్న విద్యార్థులు తగిన విద్యా రుణాలు పొందడమే కాకుండా, వారి చదువుకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుంది. మన భారతదేశంలో ఉన్న విద్యార్థులకు ఇది ఒక మంచి పథకంగా మారుతుంది. ఎవరైతే మధ్యతరగతి విద్యార్థుల ఉన్నారో ఇది కచ్చితంగా ఉపయోగపడుతుంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంలో PM Vidya Lakshmi Scheme కూడా ఆమోదం తెలిపారు.
PM Vidya Lakshmi Scheme : ముఖ్య లక్ష్యాలు
PM Vidya Lakshmi Scheme ప్రధాన లక్ష్యం ప్రతిభావంతులైన లేదా మధ్య తరగతి విద్యార్థులకైనా ఆర్థిక సహాయం చేయడం కోసం ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ పథకం ప్రతి సంవత్సరం సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిని అందించే విధంగా రూపొందించారు. పథకం ద్వారా రూ. 7.5 లక్షల వరకు విద్యార్థులకు 75% క్రెడిట్ గ్యారెంటీతో రుణం వస్తుంది, దీనివల్ల విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా విద్యను సులభంగా కొనసాగించవచ్చు.
PM Vidya Lakshmi పథకానికి సంబంధించిన ముఖ్య సమాచారం :
- పథకం పేరు: PM విద్యాలక్ష్మి పథకం ( PM Vidya Lakshmi Scheme )
- ప్రారంభం చేసినది: భారత ప్రభుత్వం ( Indian Government )
- ప్రయోజనాలు: రూ. 10 లక్షల వరకు విద్యా రుణం ( 10 Lakhs )
- అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్ ద్వారా ( Online )
- లబ్ధిదారుల సంఖ్య: ప్రతి సంవత్సరం సుమారు 22 లక్షల మంది ( Yearly 22 Lakhs Students )
- అధికారిక వెబ్‌సైట్: త్వరలో ప్రారంభించబడుతుంది ( Coming Soon )
PM Vidya Lakshmi Scheme Budget :
ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మొత్తం 3600 కోట్ల బడ్జెట్ను కేటాయించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేస్తుంది. విద్యార్థులకు సబ్సిడీ రుణం కూడా వస్తుంది. ఈ బడ్జెట్ తో 7 లక్షల వరకు ఉన్న విద్యార్థులకు రుణం పొందవచ్చు.
Scheme Details | Details | వివరాలు |
---|---|---|
Scheme Name | PM Vidya Lakshmi Scheme | PM విద్యాలక్ష్మి పథకం |
Loan Amount | Up to ₹10 Lakhs | ₹10 లక్షల వరకు రుణం |
Credit Guarantee | 75% for loans up to ₹7.5 Lakhs | ₹7.5 లక్షల వరకు రుణానికి 75% క్రెడిట్ గ్యారెంటీ |
Interest Subsidy | 3% for income below ₹8 Lakhs | ₹8 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి 3% వడ్డీ సబ్సిడీ |
Beneficiaries | 22 Lakh Students Annually | ప్రతి సంవత్సరం 22 లక్షల మంది విద్యార్థులు |
Eligibility | Indian residents, income below ₹8 Lakhs | భారత పౌరులు, వార్షిక ఆదాయం ₹8 లక్షల లోపు |
Application | Online | ఆన్‌లైన్ ద్వారా |
Required Documents | Aadhaar, ID Proof, Marksheets, Admission Letter | ఆధార్, గుర్తింపు పత్రం, మార్క్ షీట్స్, ప్రవేశ పత్రం |
Budget | ₹3600 Crores | ₹3600 కోట్ల బడ్జెట్ |
PM Vidya Lakshmi Scheme Eligibility : అర్హతలు
PM విద్యాలక్ష్మి పథకానికి అర్హత సాధించడానికి అభ్యర్థులు ఈ క్రింది ప్రమాణాలను అనుసరించాలి.
- అభ్యర్థి భారతదేశస్థిర నివాసిగా ఉండాలి.
- అర్హత కలిగిన ఉన్నత విద్యా సంస్థలో Admission పొందిన విద్యార్థులు మాత్రమే రుణం వస్తుంది.
- 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి, తదుపరి విద్యకు ఆర్థిక సహాయం పొందవచ్చు.
- రుణం పొందే విద్యార్థి కుటుంబానికి వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉండాలి.
PM Vidya Lakshmi పథకంలో లభించే ప్రయోజనాలు : Benefits
PM Vidya Lakshmi Scheme ద్వారా లభించే ముఖ్య ప్రయోజనాలు:
- ఆర్థిక సహాయం: విద్యార్థులకు రూ.10 లక్షల వరకు విద్యా రుణం లభిస్తుంది, ఇది వారికి ఉన్నత విద్యాభ్యాసానికి తోడవుతుంది.
- వడ్డీ సబ్సిడీ: విద్యార్థి కుటుంబానికి వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉంటే 3% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. రూ.4.5 లక్షల లోపు ఆదాయం ఉంటే, వారికి పూర్తిగా వడ్డీ సబ్సిడీ లభిస్తుంది.
- క్రెడిట్ గ్యారెంటీ: రూ. 7.5 లక్షల వరకు రుణానికి ప్రభుత్వం 75% క్రెడిట్ గ్యారెంటీ ఇస్తుంది, తద్వారా విద్యార్థులు ఈ రుణాన్ని సులభంగా పొందగలుగుతారు.
PM Vidya Lakshmi Scheme : అర్హత ఉన్న విద్యా సంస్థలు
NIRF ర్యాంకింగ్స్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు, మరియు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 101–200 ర్యాంకుల సంస్థలు ఈ పథకంలో ఉంటాయి. ఈ విద్యా సంస్థలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు మాత్రమే ఈ పథకం లభిస్తుంది.
How to Apply PM Vidya Lakshmi Scheme : దరఖాస్తు విధానం
ఈ పథకంలో భాగంగా విద్యార్థులు విద్యా రుణం పొందడానికి క్రింద ఇచ్చిన విధానం పాటించాలి:
- అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి “Apply Now” బటన్‌పై క్లిక్ చేయాలి.
- అభ్యర్థి పేరు, చిరునామా, ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ మొదలైన సమాచారాన్ని నమోదు చేసుకోవాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి “Submit” పై క్లిక్ చేయాలి.
PM Vidya Lakshmi Scheme Required Documents : అవసరమైన పత్రాలు
PM విద్యాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునే పత్రాలు.
- ఆధార్ కార్డు
- ఇమెయిల్ ఐడి
- మొబైల్ నంబర్
- 11వ మరియు 12వ తరగతుల మార్క్ షీట్
- ప్రవేశ పత్రం
- నివాస ధృవీకరణ పత్రం
- బ్యాంక్ ఖాతా వివరాలు
- పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
PM Vidya Lakshmi Scheme Loan and Interest : రుణ పరిమాణం మరియు వడ్డీ సబ్సిడీ
ఈ పథకం ద్వారా విద్యార్థులకు తమ కుటుంబ ఆర్ధిక పరిస్థితిని బట్టి వడ్డీ పెరగొచ్చు తగ్గించవచ్చు. క్రింద ఇచ్చాను చూడండి.
- రూ. 8 లక్షలలోపు ఆదాయం: 3% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది.
- రూ. 4.5 లక్షలలోపు ఆదాయం: పూర్తిగా వడ్డీ సబ్సిడీ లభిస్తుంది.
- రూ. 7.5 లక్షల వరకు రుణం: ప్రభుత్వం 75% క్రెడిట్ గ్యారెంటీ లభిస్తుంది.
ఈ పథకంలోని ప్రధాన లక్షణాలు :
- విద్యార్థి స్నేహపూర్వకంగా: ఈ పథకం పూర్తిగా డిజిటల్ రూపంలో నిర్వహించబడుతుంది.
- ఆర్థిక సహాయం: విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడానికి వచ్చిన పథకం PM Vidyalaxmi scheme , దీనితో మీరు రుణం పొందవచ్చు .
- సంబంధిత విద్యా సంస్థలు: NIRF ర్యాంకింగ్స్ ఆధారంగా విద్యాసంస్థలు ఇందులో భాగమవుతాయి.
PM Vidya Lakshmi Scheme విద్యార్థులకు లభించే ప్రయోజనాలు :
ఈ పథకం మన భారతదేశంలో ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే కాకుండా వారి భవిష్యత్తును మరింత మెరుగుపరచాలని సహాయం చేస్తుంది.
- PM Vidya Lakshmi Scheme Official Website – Click Here
- NIRF Official Website – Click Here
Read Also :
my name is Rithik , I am working as a content writer in mypatashala.com