Technology

iPhone 17 Air Full Details in Telugu – డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా విశ్లేషణ

iPhone 17 Air  ; యాపిల్ టెక్ ప్రపంచంలో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. “iPhone 17 Air” అనే కొత్త మోడల్, ఇప్పటివరకు విడుదలైన అన్ని ఐఫోన్‌ల కంటే సన్నగా ఉండబోతుందన్న అంచనాలు మార్కెట్‌లో భారీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ ఫోన్ డిజైన్ పరంగా వినియోగదారులను ఆకట్టుకునే విధంగా తయారవుతోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

iPhone 17 Air – Specifications :

మోడల్ ధర పరిమాణం (భారతదేశం, అంచనా)
iPhone 17 ₹80,000 – ₹90,000
iPhone 17 Air ₹90,000 – ₹1,20,000
iPhone 17 Pro ₹1,30,000 – ₹1,40,000 పైన
iPhone 17 Pro Max ₹1,60,000 – ₹1,65,000 పైన

iPhone 17 Air మందం సుమారు 5.5 మిల్లీమీటర్లు మాత్రమే ఉండబోతుందన్న సమాచారం లభించింది. ఇది ఇప్పటి వరకు వచ్చిన ఏ iPhone కన్నా తక్కువగా ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్ మరియు ప్రీమియం గ్లాస్ డిజైన్ తో కూడిన ఈ మోడల్, స్లిమ్ అయినప్పటికీ, శక్తివంతమైన పనితీరును కలిగి ఉండబోతోంది. స్క్రీన్ పరంగా చూస్తే, ఇందులో 6.5 అంగుళాల Super Retina XDR OLED డిస్‌ప్లే వుంటుందని అంచనా. ఇది 120Hz ప్రొమోషన్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయనుంది. డిస్‌ప్లే HDR10, డాల్బీ విజన్ వంటి అధునాతన టెక్నాలజీలను సపోర్ట్ చేయనుందని తెలుస్తోంది.

ప్రాసెసింగ్ శక్తికి వస్తే, iPhone 17 Airలో యాపిల్‌ తాజా 3 నానోమీటర్ టెక్నాలజీపై ఆధారపడిన A19 చిప్ వాడబడుతుంది. ఇది మెరుగైన పనితీరు, తక్కువ శక్తి వినియోగం అందించగలదు. ర్యామ్ పరంగా 8GB ఉండనుంది. స్టోరేజ్ విషయానికొస్తే, 256GB నుండి 512GB వరకు వేరియంట్లు అందుబాటులో ఉండే అవకాశముంది.

కెమెరా సెటప్‌లో వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా లెన్స్ ఉండనుంది, దీనితో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సదుపాయం లభిస్తుంది. ముందు భాగంలో ఉన్న సెల్ఫీ కెమెరా 12MP నుంచి 18MP మధ్యలో ఉండవచ్చని సమాచారం. కెమెరా వ్యవస్థ పోర్ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, 4K వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

Xiaomi 17 Series
Xiaomi 17 Series: కొత్త ఫీచర్లు, ధరలు మరియు స్పెసిఫికేషన్లు తెలుగులో

బ్యాటరీ సామర్థ్యం పరంగా చూస్తే, సన్నని డిజైన్ కారణంగా ఇది సుమారు 3140mAh కెపాసిటీలో ఉండవచ్చని ఊహిస్తున్నారు. అయినప్పటికీ, యాపిల్ కొత్తగా అభివృద్ధి చేస్తున్న శక్తి పొదుపు ఫీచర్ల వల్ల బ్యాటరీ బ్యాకప్ మామూలు వినియోగానికి తగినంతగా ఉండే అవకాశం ఉంది. ఫోన్‌లో ఫాస్ట్ ఛార్జింగ్, Mag Safe ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని సమాచారం.

కనెక్టివిటీ పరంగా, ఈ ఫోన్ 5G, Wi-Fi 7, Bluetooth 6 వంటి అత్యాధునిక సాంకేతికతలకు మద్దతునిస్తుంది. ఈ ఫోన్‌లో E – SIM మాత్రమే ఉండే అవకాశం ఉన్నందున, ట్రావెలర్లు మరియు ఇంటర్నేషనల్ యూజర్లకు ఇది మరింత ఉపయోగకరంగా మారుతుంది.

ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్‌తో రాబోతుంది. కొత్తగా డిజైన్ చేసిన OS – iOS 26తో పాటు ఈ ఫోన్‌లో యూజర్ ఇంటర్‌ఫేస్ మరింత సాఫీగా ఉండనుంది. iPhone 17 Air తన సన్నని డిజైన్, శక్తివంతమైన స్పెసిఫికేషన్లతో మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌ను ఏర్పరచే అవకాశముంది

Galaxy S25 FE Review
Galaxy S25 FE Review : ప్రీమియమ్ అనుభవం, అఫోర్డబుల్ ప్రైస్

Work form Home Jobs , Samsung S26 Ultra

iPhone 16
iPhone 16 Offer in Flipkart Sale 2025 – ఇప్పుడు కేవలం ₹51,999 మాత్రమే!

Click Here to Join Telegram Group

 

Rithik

My Name is Rithik , I am working as a content writer in mypatashala.com.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *