Honor 300 Pro 5g : హానర్ కంపెనీ తన తాజా స్మార్ట్‌ఫోన్ హానర్ 300 ప్రోను డిసెంబర్ 2024లో విడుదల చేసింది. ఈ ఫోన్ ఆధునిక సాంకేతికత, శక్తివంతమైన పనితీరు, ఆకర్షణీయమైన డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
హానం నుండి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లో ది బెస్ట్ కెమెరా మొబైల్ ఇది. ఈ మొబైల్ లో యూస్ చేయబడిన కెమెరాస్ చాలా బాగా ఉంటాయి.
ఐఫోన్ లాంటి కెమెరా క్లారిటీతో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ మన ఇండియాలో దాదాపు 40 నుండి 50 వేల మధ్యలో లాంచ్ చేయబోతున్నారు.
ఈ మొబైల్లో ఎన్నో సరికొత్త ఫీచర్స్ తో మంచి కెమెరాస్ అదిరిపోయే ప్రాసెసర్ డిస్ప్లే ఉన్నాయి ఈ మొబైల్ గురించి ఫుల్ గా డీటెయిల్ గా ఈ ఆర్టికల్ లో మాట్లాడుకుందాం.
Honor 300 Pro 5g Full Specifications and Review :
Honor 300 Pro 5g Design and display :
హానర్ 300 ప్రో 163.8 x 75.3 x 8.2 మిల్లీమీటర్ల పరిమాణం, 199 గ్రాముల బరువుతో స్లిమ్ మరియు ఎర్గోనామిక్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్‌ను అందిస్తుంది. 6.78 ఇంచ్ AMOLED డిస్‌ప్లే 1224 x 2700 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో స్పష్టమైన మరియు ప్రకాశవంతమైన విజువల్స్‌ను అందిస్తుంది. ఈ మొబైల్లో ఒక ఫ్యూచర్ ఉంది అది ఎలా పనిచేస్తుందంటే ఎంతసేపు మీరు మొబైల్ యూస్ చేసినప్పటికీ మీ కంటికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఐ ప్రొటెక్షన్ ఫీచర్ తో ఈ స్మార్ట్ ఫోన్లు తీసుకొని రావడం జరిగింది నైట్ టైం లో ఎక్కువగా స్మార్ట్ ఫోన్ యూ చేస్తారు కదా ఆ టైంలో కూడా మీ కంటిన్యూ ఇది సేఫ్ గా ఉంచుతుంది సో ఐ ప్రొటెక్షన్ కంప్లీట్ ఫ్యూచర్ తో ఈ స్మార్ట్ ఫోన్ తీసుకొని రాబోతున్నారు ఇక్కడ నాకు బాగా నచ్చింది.
Processor and performance:
హానర్ 300 ప్రోలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్, 12GB లేదా 16GB RAM, 256GB లేదా 512GB స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఈ శక్తివంతమైన హార్డ్‌వేర్ కాంబినేషన్ మల్టీటాస్కింగ్, గేమింగ్, హై-ఎండ్ యాప్లికేషన్లను సులభంగా నిర్వహిస్తుంది. ఫోన్ మేజిక్OS 9.0 (ఆండ్రాయిడ్ 15 ఆధారంగా) పై రన్ అవుతుంది, ఇది యూజర్-ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్, అధునాతన AI ఫీచర్లను అందిస్తుంది. ఇంత పవర్ఫుల్ ప్రాసెసర్ తో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తుంది ఎలాంటి గేమైనా సరే హై గ్రాఫిక్ సెట్టింగ్స్లో ఈ మొబైల్ ఈజీగా సపోర్ట్ చేస్తుంది ఎక్కువగా గేమ్స్ ఆడే వాళ్లకు ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కువ రికమెండ్ చేస్తాను.
Honor 300 Pro 5g Camera :
హానర్ 300 ప్రో వెనుక 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్‌తో), 12MP అల్ట్రావైడ్ లెన్స్‌లతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్‌లో 50MP సెల్ఫీ కెమెరా ఉంది, ఇది అధిక నాణ్యత గల సెల్ఫీలను అందిస్తుంది. ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్, OIS, EIS వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ప్రియులకు ఇది ఒక మంచి ఎంపిక. ఈ మొబైల్లో యూస్ చేసిన కెమెరాస్ తో పోలిస్తే వేరే మొబైల్స్ పనికిరావు అన్నమాట ఎందుకంటే చాలా అడ్వాన్సుడ్ కెమెరా ఫీచర్స్ ఈ మొబైల్ లో ఉంటాయి.
మెయిన్ కెమెరా 50 మెగా పిక్స్ అని ఉంటుంది ఇది మంచి డీటెయిల్స్ తో ఫొటోస్ అండ్ వీడియోస్ తీయగలుగుతుంది ఇప్పుడు మన ఇండియాలో ఉన్న చాలా ఫ్లాట్ షిప్ లాంటి మొబైల్ తో పోలిస్తే ఈ మొబైల్ గట్టి పోటీ వస్తుంది కెమెరాలో. ఐఫోన్ లాంటి కెమెరా క్లారిటీతో ఈ స్మార్ట్ ఫోన్ మన ఇండియాలో 50 వేలల్లో తీసుకొని రాబోతున్నారు కాబట్టి ఆ ప్రైస్ లో మంచి కెమెరా స్మార్ట్ఫోన్ అవుతుంది.
Battery and charging:
హానర్ 300 ప్రో 5300 mAh బ్యాటరీతో వస్తుంది, ఇది 100W వైర్డ్ ఛార్జింగ్, 80W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. వైర్డ్ ఛార్జింగ్ ద్వారా 15 నిమిషాల్లో 59% ఛార్జ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ద్వారా 15 నిమిషాల్లో 39% ఛార్జ్ పొందవచ్చు. ఇవి వేగంగా ఛార్జింగ్ అవసరాలను తీర్చడానికి సహాయపడతాయి.
Price and availability :
హానర్ 300 ప్రో చైనా మార్కెట్లో ప్రారంభ ధర CNY 3,999 (€520, సుమారు ₹46,500) వద్ద లభిస్తుంది. ఇది బ్లాక్, బ్లూ, శాండ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో లభ్యతపై స్పష్టమైన సమాచారం లేదు.
ఈ మొబైల్ మనకు తక్కువ రేట్ లో మంచి ఫ్యూచర్స్ తో లాంచ్ చేయబోతున్నారు మన ఇండియాలో ఎక్కువమంది ఈ మొబైల్ తీసుకోవడానికి ఆసక్తి చూపడానికి ప్రత్యేకమైన రీజన్ ఏదైనా ఉంది అంటే అది కెమెరాస్ మాత్రమే ఈ మొబైల్ యూస్ చేసిన కెమెరాస్ చాలా బాగుంటాయి వీళ్లు తీసుకుని రాబోయే బడ్జెట్లో ఈ మొబైల్ ఇచ్చిన ఫీచర్స్ డిస్ప్లే కానివ్వండి బ్యాటరీ కానివ్వండి పర్ఫామెన్స్ కానివ్వండి చాలా బెటర్ గా ఉంటాయి యూజింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చాలా కొత్తగా అండ్ చాలా విచిత్రంగా అనుభవిస్తారు .
Read More :
- భారతదేశంలో 30 వేల లోపు ఉన్న అత్యుత్తమ మొబైల్ ఇదే – Redmi Note 14 Pro Plus 5g
- Aadhaar Update 2024 : మిత్రమా… ఇంకా ఒక్కరోజు మాత్రమే గడువు.. త్వరగా మీ మొబైల్ లోనే ఆధార్ అప్డేట్ చేసుకోండి…
- Hyundai Venue 2025 Model అతి తక్కువ ధరలో సూపర్ ఫీచర్స్ తో 23+ మైలేజీ
- Honda Amaze 2025 Model కొత్త లుక్ తో వచ్చేసింది | ధర , మైలేజీ , రివ్యూ , ఫీచర్స్ , ఇంజన్.
- National Co-Operative Bank Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ డిగ్రీ అర్హతతో నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంకులో భారీ ఉద్యోగాలు
my name is Rithik , I am working as a content writer in mypatashala.com